రైల్లో మంటలంటూ వదంతులు.. భయంతో దూకేసిన ముగ్గురి మృతి

తాము ప్రయాణిస్తున్న రైలులో మంటలు చెలరేగాయంటూ వచ్చిన వదంతులు నమ్మి దాన్నుంచి దూకేసిన ప్రయాణికులు ముగ్గురు దుర్మరణం పాలైన ఘటన శుక్రవారం ఝార్ఖండ్‌లో చోటు చేసుకుంది.

Published : 15 Jun 2024 04:50 IST

రాంచీ: తాము ప్రయాణిస్తున్న రైలులో మంటలు చెలరేగాయంటూ వచ్చిన వదంతులు నమ్మి దాన్నుంచి దూకేసిన ప్రయాణికులు ముగ్గురు దుర్మరణం పాలైన ఘటన శుక్రవారం ఝార్ఖండ్‌లో చోటు చేసుకుంది. రాంచీ-సాసారం ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌లో రాత్రి ఎనిమిది గంటల సమయంలో మంటలు వ్యాపించాయంటూ వదంతులు రేగాయి. దీంతో అందులో ప్రయాణిస్తున్న కొందరు కుమండీహ్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో కదులుతున్న రైల్లోంచి బయటకు దూకేశారు. అదే సమయంలో దూసుకొచ్చిన గూడ్స్‌ రైలు ఢీకొని వారిలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారని ధన్‌బాద్‌ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని