రోడ్డు ప్రమాదంలో ఐదుగురు కూలీల దుర్మరణం

ఝార్ఖండ్‌లోని గడ్వా జిల్లాలో ఆటో-లారీ ఢీకొన్న ఘటనలో ఐదుగురు కూలీలు మృతిచెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. నగర్‌ ఉంటారీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగిందని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు.

Published : 15 Jun 2024 06:11 IST

ఝార్ఖండ్‌లో దుర్ఘటన

గడ్వా: ఝార్ఖండ్‌లోని గడ్వా జిల్లాలో ఆటో-లారీ ఢీకొన్న ఘటనలో ఐదుగురు కూలీలు మృతిచెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. నగర్‌ ఉంటారీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగిందని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. బాధితులంతా ఇదే పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సిలియాతోంగర్‌ గ్రామానికి చెందిన వారని పేర్కొన్నారు. పని నిమిత్తం వీరంతా శుక్రవారం ఉదయం ఆటోలో రైల్వేస్టేషన్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని