మధ్యప్రదేశ్‌లో ట్రాక్టర్‌ బోల్తా.. ఐదుగురు భక్తుల మృతి

మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లాలో భక్తులను తీసుకెళ్తోన్న ఓ ట్రాక్టర్‌ ట్రాలీ బోల్తా పడడంతో ఐదుగురు మృతి చెందారు. మరో 20మంది గాయపడ్డారు. మైథనా పాలి గ్రామంలో శుక్రవారం తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

Published : 15 Jun 2024 06:11 IST

దతియా: మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లాలో భక్తులను తీసుకెళ్తోన్న ఓ ట్రాక్టర్‌ ట్రాలీ బోల్తా పడడంతో ఐదుగురు మృతి చెందారు. మరో 20మంది గాయపడ్డారు. మైథనా పాలి గ్రామంలో శుక్రవారం తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. భక్తులందరూ రతన్‌గడ్‌ మాతా మందిరానికి వెళ్తున్న క్రమంలో ట్రాక్టర్‌ అదుపు తప్పి కల్వర్టులోకి దూసుకెళ్లిందని పేర్కొన్నారు. డ్రైవర్‌ నిద్ర మత్తు వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుల్లో ముగ్గురు బాలికలు, ఇద్దరు మహిళలు ఉన్నారు. ప్రమాద ఘటనపై మధ]్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని