బవారియా గ్యాంగ్‌ పంజా

నగరంపై ఉత్తరప్రదేశ్‌కు చెందిన భవారియా గ్యాంగ్‌ పంజా విసిరింది. ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు దొంగలు వరుసగా నాలుగు చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు.

Updated : 16 Jun 2024 04:58 IST

ఒకేరోజు నాలుగు గొలుసు చోరీలు

చోరీకి పాల్పడ్డ నిందితులు

ఈనాడు, హైదరాబాద్‌: నగరంపై ఉత్తరప్రదేశ్‌కు చెందిన భవారియా గ్యాంగ్‌ పంజా విసిరింది. ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు దొంగలు వరుసగా నాలుగు చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. రాచకొండ పరిధిలోని జవహర్‌నగర్‌లో శనివారం 12.20 గంటలకు తొలుత గొలుసు దొంగిలించిన నేరస్థులు.. ఆ తర్వాత శామీర్‌పేట పరిధిలో కేశవరం, అనంతారంలో రెండు గొలుసులు, సిద్ధిపేట చీర్యాలలో ఒక గొలుసు దొంగిలించారు. నిందితులిద్దరూ ద్విచక్రవాహనంపై వెళుతూ ఈ వరుసగా చోరీలు చేశారు.

గొలుసు చోరీలు వరుసగా...

మధ్యాహ్నం 12.20: జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ మహిళ నడుచుకుంటూ వెళ్తుండగా.. బైకు మీద వచ్చిన దుండగులు ఆమె మెడలోని గొలుసు లాక్కొని పరారయ్యారు.

  • 2.30: శామీర్‌పేటలోని కేశవరానికి చెందిన గోనె రత్నమ్మ తన ఇంటి ముందు కూర్చుని మరో మహిళతో మాట్లాడుతోంది. ఇంతలో అక్కడికి ద్విచక్రవాహనంపై ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఓ వ్యక్తి రత్నమ్మ దగ్గరకు వచ్చి హిందీలో మాట్లాడుతూ.. ఒక్కసారిగా మెడలోని  పుస్తలతాడు తెంపుకొని ద్విచక్రవాహనంపై పరారయ్యాడు.
  • 2.50: శామీర్‌పేట పరిధి అనంతారం గ్రామానికి చెందిన బుట్ట సత్యలక్ష్మి పని ప్రదేశం ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా గ్రామ పంచాయతీ దగ్గర ఇద్దరు వ్యక్తులు ఎదురుగా వచ్చారు. ఆమె మెడలోని 3.5 తులాల పుస్తెలతాడు తెంపుకొని పరారయ్యారు.
  • 4.00: సిద్ధిపేట కమిషనరేట్‌ పరిధిలో చీర్యాల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఒక మహిళ నడుచుకుంటూ వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు మెడలోని గొలుసు లాక్కొని పరారయ్యారు.  
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని