ఝార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్‌.. ఐదుగురు మావోయిస్టుల మృతి

ఝార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భమ్‌ జిల్లాలో సోమవారం జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో ఒక మహిళతో సహా మొత్తం ఐదుగురు మావోయిస్టులు మరణించారని, మరో ఇద్దరు అరెస్టయ్యారని అధికారులు తెలిపారు.

Published : 18 Jun 2024 03:19 IST

చైబాసా: ఝార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భమ్‌ జిల్లాలో సోమవారం జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో ఒక మహిళతో సహా మొత్తం ఐదుగురు మావోయిస్టులు మరణించారని, మరో ఇద్దరు అరెస్టయ్యారని అధికారులు తెలిపారు. రాంచీకి 200 కిలోమీటర్ల దూరంలోని లిపుంగా అడవుల్లో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది.  సోదాలో ఒక ఇన్సాస్‌ రైఫిల్, రెండు ఎస్‌.ఎల్‌.ఆర్‌.లు, మూడు పాయింట్‌ 303 రైఫిళ్లు,  పిస్టల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాల్పుల్లో మరణించిన సబ్‌ జోనల్‌ కమాండర్‌ సింగ్‌ రాయ్‌ తల మీద రూ. 10 లక్షలు, జోనల్‌ కమాండర్‌ కాండేపై రూ. 5 లక్షలు, ఏరియా కమాండర్‌ సూర్యపై రూ. 2 లక్షల రివార్డు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని