నడిరోడ్డుపై ప్రియురాలి దారుణ హత్య

మహారాష్ట్రలోని పాల్ఘర్‌ జిల్లాలో దారుణం జరిగింది. 22 ఏళ్ల యువతిని ఆమె ప్రియుడు నడిరోడ్డుపై హత్యచేశాడు. పెద్ద స్పానర్‌తో తలపై కొట్టి చంపాడు. ఈ హత్య బహిరంగంగానే జరిగినా.. బాధితురాలిని రక్షించేందుకు ఎవరూ సాహసించలేదు.

Updated : 19 Jun 2024 06:25 IST

మహారాష్ట్రలో ప్రియుడి ఘాతుకం

పాల్ఘర్‌: మహారాష్ట్రలోని పాల్ఘర్‌ జిల్లాలో దారుణం జరిగింది. 22 ఏళ్ల యువతిని ఆమె ప్రియుడు నడిరోడ్డుపై హత్యచేశాడు. పెద్ద స్పానర్‌తో తలపై కొట్టి చంపాడు. ఈ హత్య బహిరంగంగానే జరిగినా.. బాధితురాలిని రక్షించేందుకు ఎవరూ సాహసించలేదు. నిందితుడు రోహిత్‌ యాదవ్‌(32), ఆర్తి యాదవ్‌ ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. జిల్లాలోని నాలాసోపారాలో వేర్వేరుగా నివాసం ఉంటూ ఓ పారిశ్రామికవాడలో పనిచేస్తున్నారు. మంగళవారం ఉదయం 8:30 గంటలకు వీరిద్దరూ పనికోసం బయలుదేరారు. మార్గమధ్యలో గొడవ జరిగింది. దీంతో ఆగ్రహించిన రోహిత్‌.. స్పానర్‌తో యువతి తలపై పలుమార్లు కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఆర్తికి మరొకరితో సంబంధం ఉందన్న అనుమానంతో రోహిత్‌ ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని