సొత్తు పంపకాల్లో తేడాలు.. యువకుడి హత్య

ఇద్దరు దొంగల మధ్య చోరీ సొత్తు పంపకాల్లో ఏర్పడిన వివాదం హత్యకు దారి తీసింది. కత్తితో పొడిచి బండ రాళ్లతో మోది హత్య చేసిన ఘటన సనత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది.

Updated : 20 Jun 2024 04:28 IST

సనత్‌నగర్, న్యూస్‌టుడే: ఇద్దరు దొంగల మధ్య చోరీ సొత్తు పంపకాల్లో ఏర్పడిన వివాదం హత్యకు దారి తీసింది. కత్తితో పొడిచి బండ రాళ్లతో మోది హత్య చేసిన ఘటన సనత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ పురేందర్‌రెడ్డి వివరాల ప్రకారం.. ఎర్రగడ్డ ఏజీ కాలనీ సమీపంలోని నేతాజీనగర్‌కు చెందిన సయ్యద్‌ అజార్‌ (22) ఎర్రగడ్డకు చెందిన మహ్మద్‌ ఆసిఫ్‌ (23) తోడుదొంగలు. వీరు పలు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. సొత్తును విక్రయించి డబ్బు పంచుకునేవారు. ఇటీవల వీరిద్దరి మధ్య చోరీ సొత్తు పంపకాల విషయంలో తేడా వచ్చింది. దీంతో ఘర్షణ పడ్డారు. మంగళవారం రాత్రి ఇద్దరు మద్యం తాగి భరత్‌నగర్‌ ఎంఎంటీఎస్‌ రైల్వేస్టేషన్‌ వెనుక పొదల్లోకి వెళ్లారు. అక్కడ మళ్లీ మద్యం తాగి ఘర్షణ పడ్డారు. ఘర్షణలో సయ్యద్‌ అజార్‌ను మహమ్మద్‌ ఆసిఫ్‌ కత్తితో పొడిచి రాళ్లతో తలపై మోది హత్య చేసి పరారయ్యాడు. బుధవారం మధ్యాహ్నం తానే మరోమిత్రుడైన అజీజ్‌కు ఫోన్‌ చేసి తాను సయ్యద్‌ అజార్‌ను హత్య చేసి మృతదేహాన్ని పొదల్లో వేసిన విషయం చెప్పాడు. పొదల్లో మృతదేహం ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అది అజార్‌దేనని గుర్తించి నిందితుడు మహమ్మద్‌ ఆసిఫ్‌ కోసం గాలిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని