ప్రియుడితో కలిసి ఘాతుకం.. భర్తను కాల్చిచంపమన్న భార్య

ఆమె ఓ పరాయి మగాడి మోజులో పడింది. అడ్డుగా ఉన్న భర్తను చంపాలనుకొంది. ఒకటికి రెండుసార్లు ప్రయత్నించి విజయం సాధించినా.. చివరకు పట్టుబడి కటకటాలపాలైంది.

Updated : 20 Jun 2024 06:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆమె ఓ పరాయి మగాడి మోజులో పడింది. అడ్డుగా ఉన్న భర్తను చంపాలనుకొంది. ఒకటికి రెండుసార్లు ప్రయత్నించి విజయం సాధించినా.. చివరకు పట్టుబడి కటకటాలపాలైంది. హరియాణాలోని పానీపత్‌లో కంప్యూటర్‌ ఇన్‌స్టిట్యూట్‌ నిర్వహిస్తున్న వినోద్‌ బరారకు నిధి అనే యువతితో వివాహమైంది. ఈ దంపతులకు ఓ పాప కూడా ఉంది. నిధి కొన్నేళ్ల క్రితం సుమిత్‌ అనే జిమ్‌ శిక్షకుడి మోజులో పడింది. వినోద్‌కు ఈ విషయం తెలియడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో వినోద్‌ను అడ్డు తొలగించుకొని సుమిత్‌తో జీవించాలని నిధి నిర్ణయించుకొంది. పంజాబ్‌కు చెందిన దేవ్‌ సునార్‌ అనే లారీ డ్రైవరుకు రూ.10 లక్షలు సుపారీ ఇచ్చి.. తన భర్తను వాహనంతో ఢీకొట్టి చంపాలని చెప్పింది. 2021 అక్టోబరు 5న జరిగిన ఈ ఘటనలో తీవ్రగాయాలతో వినోద్‌ బయటపడ్డాడు. నిధి మరోసారి దేవ్‌కు కబురుపెట్టింది. ఈసారి తుపాకీతో కాల్చి చంపాలని సూచించింది. ఇంట్లో మంచానపడున్న వినోద్‌ను దేవ్‌ పాయింట్‌బ్లాంక్‌ రేంజిలో కాల్చి చంపాడు. పోలీసులు దేవ్‌ను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో నిధి విలాసవంతమైన జీవనశైలి వినోద్‌ కుటుంబికుల్లో అనుమానాలను పెంచి.. హత్య జరిగిన మూడేళ్లకు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దేవ్‌ కాల్‌డేటాను బయటకుతీసిన పోలీసుల ప్రత్యేకబృందం అసలు కుట్రను ఛేదించి నిందితులను అరెస్టు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని