నిలిపి ఉంచిన రైలు బోగీల్లో మంటలు

సికింద్రాబాద్‌ కోచింగ్‌ డిపోకు సంబంధించిన మెయింటెనెన్స్‌ వాషింగ్‌ లైన్‌లో ఉంచిన ప్యాంట్రీ కార్, ఏసీ కోచ్‌లలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

Published : 21 Jun 2024 06:07 IST

ప్యాంట్రీకార్‌తో పాటు త్రీటైర్‌ ఏసీ కోచ్‌ దగ్ధం

బోగీల్లో మంటలు చెలరేగడంతో వ్యాపించిన పొగ 

రెజిమెంటల్‌బజార్, న్యూస్‌టుడే: సికింద్రాబాద్‌ కోచింగ్‌ డిపోకు సంబంధించిన మెయింటెనెన్స్‌ వాషింగ్‌ లైన్‌లో ఉంచిన ప్యాంట్రీ కార్, ఏసీ కోచ్‌లలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం 10.30 గంటల సమయంలో అక్కడున్న ప్యాంట్రీ కారు, ఏసీ బోగీలో నుంచి పొగలు రావడం అక్కడున్న సిబ్బంది గుర్తించారు.  వెంటనే ఉన్నతాధికారులు, అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, వాషింగ్‌ యార్డు ఉద్యోగులు రెండు వైపుల నుంచి నీటిని చల్లి మంటలను ఆర్పేశారు. అదే సమయంలో మంటలు వ్యాపించకుండా ఆ కోచ్‌ను ఇతర బోగీల నుంచి వేరుచేశారు. ఈ ప్రమాదంలో రెండు బోగీలు కాలిపోయాయి. మెయింటెనెన్స్‌ సిబ్బంది గుర్తించడం, వెంటనే స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. బోగీల్లో ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా జీఆర్పీ, ఆర్పీఎఫ్‌ పోలీసులతో పాటు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిప్రమాదం విషయం తెలుసుకున్న దక్షిణ మధ్య జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్, ఇతర అధికారులు సిబ్బందితో కలిసి ఘటన స్థలాన్ని సందర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని