మద్యం మత్తులో భార్యపై ఇటుకతో దాడి

మద్యం మత్తులో కట్టుకున్న భార్యను, భర్త ఇటుకరాయితో కొట్టడంతో తలకు తీవ్ర గాయమైన సంఘటన మండలంలోని తూర్పుచౌటపాలెంలో శుక్రవారం చోటుచేసుకుంది

Updated : 22 Jun 2024 06:16 IST

నిందితుడు యాకోబును చెట్టుకు కట్టేసిన స్థానికులు  

దర్శి, న్యూస్‌టుడే: మద్యం మత్తులో కట్టుకున్న భార్యను, భర్త ఇటుకరాయితో కొట్టడంతో తలకు తీవ్ర గాయమైన సంఘటన మండలంలోని తూర్పుచౌటపాలెంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, వైద్య సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చిన్నమ్మితో దొనకొండ మండలం పెద్దగుడిపాడుకు చెందిన గన్నెపల్లి యూకోబుతో ఇరవై సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. వివాహమైనప్పటి నుంచి చౌటపాలెంలో ఉంటూ బేల్దారీ పనులు చేసుకుని జీవించే యాకోబు తరచూ మద్యం తాగి భార్యా పిల్లలతో గొడవలకు దిగేవాడు. పలు సందర్భాల్లో కుమార్తెతో కూడా అసభ్యంగా ప్రవర్తించేవాడని భార్య, స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో గురువారం మద్యం తాగి భార్యా పిల్లలతో గొడవ పడుతున్న సమయంలో ఇరుగుపొరుగు వారు జోక్యం చేసుకుని అక్కడి నుంచి అతడిని తన స్వగ్రామానికి పంపించారు. దీంతో భార్యపై కక్ష పెంచుకుని శుక్రవారం తెల్లవారుజామున మద్యం తాగి వచ్చి ఇటుకురాయితో తలపై కొట్టాడు. చిన్నమ్మి అరుపులు విని స్థానికులు అక్కడకు వచ్చి అడ్డుకున్నారు. యాకోబును చెట్టుకు కట్టేశారు. తలకు తీవ్ర గాయమైన ఆమెను చికిత్స నిమిత్తం దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని