అప్పుల బాధతో యువ కౌలురైతు బలవన్మరణం

అప్పుల బాధతో ఓ యువ కౌలురైతు పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని రెడ్లరేపాక గ్రామంలో గురువారం చోటు చేసుకుంది.

Updated : 22 Jun 2024 06:33 IST

వలిగొండ, న్యూస్‌టుడే: అప్పుల బాధతో ఓ యువ కౌలురైతు పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని రెడ్లరేపాక గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జోర్క రాములమ్మ-అంజయ్య దంపతుల చిన్న కుమారుడు నరేశ్‌(31) వ్యవసాయం చేస్తుంటాడు. గతేడాది 4 ఎకరాల భూమి కౌలుకు తీసుకొని పత్తి పంట సాగు చేయగా ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. ప్రస్తుత, గత పంటల సాగుకు కలిపి రూ.4.5 లక్షల వరకు అప్పులయ్యాయి. మనస్తాపం చెందిన నరేశ్‌ వ్యవసాయ క్షేత్రంలో పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరాడు. గమనించిన కుటుంబసభ్యులు గాంధీ ఆసుపత్రి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి మృతి చెందాడు. నరేశ్‌కు రెండు నెలల క్రితం వివాహమైంది. కుటుంబీకులు సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి చేస్తున్నట్లు ఎస్సై మహేందర్‌ శుక్రవారం తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని