కామాంధుడైన తండ్రికి 104 ఏళ్ల జైలుశిక్ష

కన్నకూతురిపై అత్యాచారానికి పాల్పడి ఆమె గర్భం దాల్చేందుకు కారకుడైన ఓ కామాంధుడికి కేరళ కోర్టు 104 ఏళ్ల కఠిన కారాగార శిక్షను విధించింది.

Published : 23 Jun 2024 05:01 IST

మలప్పురం: కన్నకూతురిపై అత్యాచారానికి పాల్పడి ఆమె గర్భం దాల్చేందుకు కారకుడైన ఓ కామాంధుడికి కేరళ కోర్టు 104 ఏళ్ల కఠిన కారాగార శిక్షను విధించింది. దోషి (41)కి మలప్పురం జిల్లాలోని మంజేరీ ఫాస్ట్‌ట్రాక్‌ స్పెషల్‌ కోర్టు (2) న్యాయమూర్తి ఎస్‌.రష్మి ఈ శిక్షను వేశారు. అరికోడ్‌కు చెందిన దోషికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2006లో బాధితురాలు జన్మించింది. ఆమెకు పదేళ్ల వయసు వచ్చినప్పటి నుంచీ తండ్రి నిత్యం లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. బయట చెబితే చంపేస్తానని బెదిరించేవాడు. ఈ నేపథ్యంలో అనారోగ్యానికి గురైన ఆమెను తండ్రే అరికోడ్‌ ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. గర్భవతి అని వైద్యపరీక్షల్లో తేలింది. దీంతో అరికోడ్‌ ఆస్పత్రి నుంచి కోజికోడ్‌ వైద్య కళాశాలకు రిఫర్‌ చేశారు. వైద్యుల సూచన మేరకు అక్కడ గర్భస్రావం చేశారు. ఆ తర్వాత బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన అరికోడ్‌ పోలీసులు గతేడాది ఏప్రిల్‌లో నిందితుణ్ని అరెస్టు చేసి విచారణ ప్రారంభించారు. కోర్టు దోషికి పలు సెక్షన్ల కింద 104 ఏళ్ల జైలుశిక్ష విధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు