గొంతులో ఇరుక్కున్న మాంసం ముక్క.. వ్యక్తి మృతి

సోదరిని కలిసేందుకు హైదరాబాద్‌ వచ్చిన వ్యక్తి రోడ్డు పక్కన మృతి చెంది కనిపించాడు. శవపరీక్ష నిర్వహించగా మాంసం ముక్క గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక చనిపోయినట్లు తేలింది.

Published : 23 Jun 2024 05:19 IST

సైదాబాద్, న్యూస్‌టుడే: సోదరిని కలిసేందుకు హైదరాబాద్‌ వచ్చిన వ్యక్తి రోడ్డు పక్కన మృతి చెంది కనిపించాడు. శవపరీక్ష నిర్వహించగా మాంసం ముక్క గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక చనిపోయినట్లు తేలింది. సైదాబాద్‌ పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని అన్నారం గ్రామానికి చెందిన సనుగోముల శ్రీకాంత్‌(39) కూలీ. భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. సోదరిని కలిసేందుకు శుక్రవారం రాత్రి హైదరాబాద్‌కు వచ్చాడు. ఇల్లు ఖాళీ చేయడంతో చిరునామా తెలుసుకునేందుకు ఫోన్‌ చేశాడు. ఓ విందులో ఉన్నామని, వచ్చేసరికి ఆలస్యమవుతుందని ఆమె చెప్పింది. దీంతో కోఠిలో మద్యం తాగి చికెన్‌ బిర్యానీ తిన్నాడు. స్నేహితుడి ఇంటికి వెళ్లేందుకు ఆటోలో సైదాబాద్‌ ఠాణా పరిధిలోని లక్ష్మీనగర్‌ కాలనీకి వచ్చాడు. అప్పటికే గొంతులో చికెన్‌ ముక్క ఉండటంతో శ్వాస ఆడక ఆటోలో కుప్పకూలిపోయాడు. గమనించిన డ్రైవర్‌ కాలనీ కాలిబాటపై పడుకోబెట్టి వెళ్లిపోయాడు. శనివారం ఉదయం కాలనీవాసులు పోలీసులకు సమాచారమిచ్చారు. అతడి సెల్‌ఫోన్‌కు చివరిసారి చేసిన నంబరుకు ప్రయత్నించడంతో ఆయన సోదరి వచ్చి వివరాలు వెల్లడించింది. సీసీ ఫుటేజీ ద్వారా ఆటో డ్రైవరును పిలిపించి మాట్లాడి.. మద్యం కారణంగా చనిపోయినట్లు భావించారు. శవపరీక్ష నిర్వహించగా గొంతులో మాంసం ముక్క కారణంగా ఊపిరి ఆడక చనిపోయినట్లు తేలింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు