అనిశా అధికారుల వల.. పరారైన ఎస్సై

లంచం తీసుకుంటూ ఓ మధ్యవర్తి అనిశా అధికారుల వలకు చిక్కగా అతడిని పంపించిన ఎస్సై పరారయ్యాడు.

Published : 23 Jun 2024 06:42 IST

 లంచం తీసుకున్న మధ్యవర్తి అరెస్టు

రాయికల్, న్యూస్‌టుడే: లంచం తీసుకుంటూ ఓ మధ్యవర్తి అనిశా అధికారుల వలకు చిక్కగా అతడిని పంపించిన ఎస్సై పరారయ్యాడు. అనిశా డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలంలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన రాజేందర్‌రెడ్డికి చెందిన ఇసుక ట్రాక్టరును పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. ట్రాక్టరును వదిలిపెట్టేందుకు రాయికల్‌ ఎస్సై అజయ్‌ రూ.15 వేలు లంచం తీసుకుని, మరో రూ.10 వేలు కావాలని డిమాండ్‌ చేయడంతో రాజేందర్‌రెడ్డి అనిశా అధికారులను ఆశ్రయించారు. రాయికల్‌లో శుక్రవారం రాత్రి ఎస్సై సూచన మేరకు ఇటిక్యాలకు చెందిన పుల్లూరి రాజు అనే మధ్యవర్తికి రాజేందర్‌రెడ్డి రూ.10 వేలు ఇస్తుండగా అనిశా అధికారులు వలపన్ని పట్టుకున్నారు. గమనించిన ఎస్సై అజయ్‌ పారిపోయాడు. లంచం సొమ్మును స్వాధీనపరచుకున్న అధికారులు రాజును అరెస్టు చేసి శనివారం కరీంనగర్‌ అనిశా న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఎస్సై అజయ్‌ పరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని