గొర్రెల కాపరి గొంతు కోసి దారుణ హత్య

రాత్రి గొర్రెల దొడ్డి వద్ద పడుకున్న కాపరి ఉదయం వరకు దారుణ హత్యకు గురైన ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల పట్టణంలో శనివారం వెలుగు చూసింది.

Published : 23 Jun 2024 05:10 IST

కుమార్తె ప్రేమ వ్యవహారమే కారణమై ఉంటుందని అనుమానాలు..! 

జడ్చర్ల గ్రామీణం, న్యూస్‌టుడే: రాత్రి గొర్రెల దొడ్డి వద్ద పడుకున్న కాపరి ఉదయం వరకు దారుణ హత్యకు గురైన ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల పట్టణంలో శనివారం వెలుగు చూసింది. సీఐ ఆదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జడ్చర్ల పట్టణంలో 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న రాజీవ్‌నగర్‌ కాలనీలో నివాసం ఉండే మేకం చిన్న ఆంజనేయులు(44)కు భార్య, నలుగురు సంతానం. వారం క్రితం ఆయన కుమార్తె(17) ప్రేమ వ్యవహారం తెలిసి ఆమెను మందలించారు. ఈ నెల 20న కుమార్తె మరోమారు గుర్తుతెలియని వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడుతుండటం చూసి చెంపదెబ్బకొట్టారు. అడ్డుకోబోయిన భార్యపైనా చేయి చేసుకున్నారు. ఈ క్రమంలో ఈ నెల 21న ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన కుమార్తె సాయంత్రం తిరిగొచ్చింది. అదే రోజు రాత్రి 10 గంటలకు చిన్న ఆంజనేయులు కాలనీ వెనకున్న తన మేకలదొడ్డి వద్దకు వెళ్లి పడుకున్నారు. ఉదయం ఆయన కుమారుడు విజయ్‌మోహన్‌ వెళ్లి చూసేసరికి విగతజీవిగా కనిపించారు. ఆయన గొంతు కోసి ఉంది. డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ ఆదిరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. హత్య జరిగిన స్థలంలో మద్యం సీసా, రెండు గ్లాసులు ఉన్నట్లు గుర్తించారు. రెండ్రోజులుగా ఇంట్లో చోటు చేసుకున్న వ్యవహారాలే హత్యకు కారణమై ఉంటాయని మృతుడి అన్న నడిపి ఆంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని