ఎమ్మెల్సీ సూరజ్‌ రేవణ్నపై అసహజ లైంగిక దాడి ఆరోపణలు..

జనతాదళ్‌ (సెక్యులర్‌) పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. తనపై అసహజ లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఎమ్మెల్సీ సూరజ్‌ రేవణ్నపై ఆ పార్టీ కార్యకర్త ఒకరు ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టిస్తోంది.

Published : 23 Jun 2024 05:11 IST

అదుపులోకి తీసుకున్న కర్ణాటక పోలీసులు 

హాసన, న్యూస్‌టుడే: జనతాదళ్‌ (సెక్యులర్‌) పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. తనపై అసహజ లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఎమ్మెల్సీ సూరజ్‌ రేవణ్నపై ఆ పార్టీ కార్యకర్త ఒకరు ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టిస్తోంది. పోలీసు డైరెక్టర్‌ జనరల్, ముఖ్యమంత్రి, హోంమంత్రి, హాసన జిల్లా ఎస్పీలకు బాధితుడు (25) శుక్రవారం తన గోడు వివరిస్తూ లేఖ రాశారు. అనంతరం హొళెనరసీపుర ఠాణాలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎమ్మెల్సీ సూరజ్‌ను శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు, బాధితుణ్ని వైద్య పరీక్షల నిమిత్తం హాసన జిల్లా ఆసుపత్రికి తరలించారు. నిందితుణ్ని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచి దర్యాప్తు కొనసాగించే అవకాశముంది. సూరజ్‌ సోదరుడు ప్రజ్వల్‌ ఇప్పటికే అత్యాచారం కేసులో అరెస్టు కాగా.. తండ్రి హెచ్‌.డి.రేవణ్న బెయిల్‌పై ఉన్నారు. సూరజ్‌ వ్యవహారంపై ఆయన చిన్నాన్న, కేంద్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి హెచ్‌.డి.కుమారస్వామిని ప్రశ్నించగా.. ‘ఈ విషయాలు నాతో ఎందుకు ప్రస్తావిస్తున్నారు? ప్రజల సమస్యలుంటే అడగండి.. స్పందిస్తా’ అని అసహనం వ్యక్తం చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని