మహిళను ముక్కలుగా చేసి 2 రైళ్లలో వదిలేశాడు

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో మహిళపై అత్యాచారానికి విఫలయత్నం చేసిన ఓ వ్యక్తి.. ఆమెను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా కోసి, రెండు రైళ్లలో వదిలేసిన దారుణం వెలుగుచూసింది.

Updated : 24 Jun 2024 06:27 IST

మహిళ మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో మహిళపై అత్యాచారానికి విఫలయత్నం చేసిన ఓ వ్యక్తి.. ఆమెను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా కోసి, రెండు రైళ్లలో వదిలేసిన దారుణం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. భర్తతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వచ్చిన ఓ మహిళ (37) మథుర వెళ్లేందుకు ఉజ్జయిని రైల్వేస్టేషనుకు చేరుకొంది. ఆమె ఒంటరిగా ఉన్నట్లు గమనించిన కమలేశ్‌ పటేల్‌ (60) అనే వ్యక్తి మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకువెళ్లాడు. ఆహారంలో నిద్రమాత్రలు కలిపి, అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆమె మేల్కొని కేకలు వేయడంతో గొంతు నులిమి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా చేసి.. రెండు వేర్వేరు రైళ్లలో (ఇందౌర్‌ - నాగ్దా, ఇందౌర్‌ - దేహ్రాదూన్‌) ప్లాస్టిక్‌ సంచుల్లో పెట్టి వదిలేశాడు. ఒక రైలు అటు ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌కు, మరో రైలు ఇటు మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌కు చేరుకున్నాక ఈ దారుణం బయటపడింది. పోలీసులు ఉజ్జయినిలో నిందితుడిని అరెస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని