వివాహేతర సంబంధం బయటపడిందని ఇద్దరి ఆత్మహత్య

వివాహేతర సంబంధం కుటుంబసభ్యులకు తెలియడంతో ఆందోళనకు గురై ఓ జంట ఆత్మహత్య చేసుకుంది. ఈఘటన పెద్దపప్పూరు మండలంలోని చాగల్లు జలాశయ పరిధిలో సోమవారం జరిగింది.

Updated : 25 Jun 2024 06:39 IST

నిజామా, మహబూబ్‌బాషా  

పెద్దపప్పూరు, న్యూస్‌టుడే : వివాహేతర సంబంధం కుటుంబసభ్యులకు తెలియడంతో ఆందోళనకు గురై ఓ జంట ఆత్మహత్య చేసుకుంది. ఈఘటన పెద్దపప్పూరు మండలంలోని చాగల్లు జలాశయ పరిధిలో సోమవారం జరిగింది. దీనికి సంబంధించి ఎస్సై గౌస్‌బాషా తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుత్తి మండలం బేతాపల్లికి చెందిన నిజామా(35) వరుసకు మరిది అయిన తాడిపత్రి మండలం గన్నెవారిపల్లికి చెందిన మహబూబ్‌బాషా(26)తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈక్రమంలో రెండు రోజుల కిందట ఇంటి నుంచి ఇద్దరూ బయటికి వచ్చేశారు. ఇది కుటుంబ సభ్యులకు తెలియడంతో పెద్దపప్పూరు మండలంలోని చాగల్లు జలాశయంలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గౌస్‌బాషా తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని