బేగంపేట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు

హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో బాంబు పెట్టినట్లు అగంతకులు మెయిల్‌ చేయడంతో సోమవారం కలకలం రేగింది.

Published : 25 Jun 2024 05:27 IST

హుటాహుటిన విస్తృత తనిఖీలు

బేగంపేట, న్యూస్‌టుడే: హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో బాంబు పెట్టినట్లు అగంతకులు మెయిల్‌ చేయడంతో సోమవారం కలకలం రేగింది. నగర పోలీసులు అప్రమత్తమై హుటాహుటిన విస్తృతస్థాయిలో తనిఖీలు చేపట్టారు. కేంద్ర బలగాలు విమానాశ్రయాన్ని జల్లెడ పట్టాయి. బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణమూర్తి, ఇన్‌స్పెక్టర్‌ రామయ్యతోపాటు ఎస్సైలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు, కేంద్ర సాయుధ బలగాలు; డాగ్, బాంబ్‌ స్క్వాడ్‌ బృందాలు విమానాశ్రయ టెర్మినళ్లలో సోదాలు చేశాయి. సుమారు 3 గంటల పాటు అన్ని కార్యాలయాలు, సమావేశ మందిరాలు, పార్కింగ్, సిబ్బంది పనిచేసే ప్రాంతాలు, సమీపంలోని పోస్టాఫీసులో కూడా తనిఖీలు చేపట్టారు. రన్‌వేపై కూడా బాంబు స్క్వాడ్‌ తనిఖీలు చేసింది. చివరకు బాంబు లేదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మెయిల్‌ ఎక్కడి నుంచి వచ్చిందో ఆరా తీస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని