ఆత్మహత్యకు యత్నించిన తల్లి, కుమార్తె మృతి

కుటుంబ కలహాలతో కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌ మండలంలోని గజ్జిగూడ గ్రామానికి చెందిన ఓ కుటుంబంలోని తల్లీ, ముగ్గురు కుమార్తెలు సోమవారం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే.

Published : 04 Jul 2024 06:40 IST

మృత్యువుతో పోరాడుతున్న మరో ఇద్దరు కుమార్తెలు

కాగజ్‌నగర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: కుటుంబ కలహాలతో కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌ మండలంలోని గజ్జిగూడ గ్రామానికి చెందిన ఓ కుటుంబంలోని తల్లీ, ముగ్గురు కుమార్తెలు సోమవారం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. చికిత్స పొందుతూ తల్లి అనిత (45), కుమార్తె రమ్య (16) బుధవారం మృతి చెందారు. మిగతా ఇద్దరు కుమార్తెలు లక్ష్మి, ఐశ్వర్య సైతం మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు కాగజ్‌నగర్‌ రూరల్‌ సీఐ రాంబాబు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని