హాథ్రస్‌ ఘటనలో ఆరుగురి అరెస్టు

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని హాథ్రస్‌ జిల్లా ఫుల్‌రయీలో సత్సంగ్‌ సందర్భంగా తొక్కిసలాట చోటుచేసుకుని 121 మంది మరణానికి కారణమైన ఘటనలో ఆరుగురిని గురువారం పోలీసులు అరెస్టు చేశారు.

Published : 05 Jul 2024 03:07 IST

ఇంకా ఆచూకీ దొరకని భోలే బాబా

హాథ్రస్‌: ఉత్తర్‌ ప్రదేశ్‌లోని హాథ్రస్‌ జిల్లా ఫుల్‌రయీలో సత్సంగ్‌ సందర్భంగా తొక్కిసలాట చోటుచేసుకుని 121 మంది మరణానికి కారణమైన ఘటనలో ఆరుగురిని గురువారం పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. వీరు భోలే బాబా సత్సంగ్‌లో సేవకులుగా (వాలంటీర్లు) వ్యవహరించారు. మంగళవారం నాడు తొక్కిసలాట జరిగిన సమయంలో వేదిక లోపల వీరే జనాన్ని నియంత్రించే బాధ్యతలను చేపట్టారు. వారు విఫలం కావడంతో తొక్కిసలాట జరిగి 121 మంది చనిపోయారు. మరోవైపు ప్రధాన నిందితుడైన దేవ్‌ప్రకాశ్‌ మధుకర్‌ ఆచూకీ చెప్పిన వారికి రూ.లక్ష రివార్డును అందజేస్తామని పోలీసులు ప్రకటించారు. అతడిపై నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న సూరజ్‌పాల్‌ అలియాస్‌ నారాయణ్‌ సాకార్‌ హరి అలియాస్‌ భోలే బాబా ఆచూకీ దొరకలేదు. అతడు దొరికితే ప్రశ్నిస్తామని అలీగఢ్‌ ఐజీ శాలభ్‌ మాథుర్‌ తెలిపారు. భోలే బాబాను కేసులో నిందితుడిగా చేర్చలేదు.భోలే బాబా సత్సంగ్‌ కార్యక్రమానికి 80వేల మంది కోసం అనుమతి తీసుకోగా.. దాదాపు రెండున్నర లక్షల మంది హాజరైనట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు.

  • రాహుల్‌ గాంధీ హాథ్రస్‌ను సందర్శించి, బాధితులను పరామర్శిస్తారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ తెలిపారు. 
  • భోలే బాబా కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. మెయిన్‌పురిలో ఉన్న ఆశ్రమంవద్ద పోలీసు బలగాలను మోహరించారు. 
  • తొక్కిసలాటలో మరణించిన 121 మంది మృత దేహాలను గురువారం నాటికి బంధువులకు అప్పగించారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని