అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

ఆర్థిక సమస్యలను తట్టుకోలేక గురువారం నల్గొండ జిల్లా చందంపేట మండలం యాపలపాయతండాలో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Published : 05 Jul 2024 03:43 IST

చందంపేట, న్యూస్‌టుడే: ఆర్థిక సమస్యలను తట్టుకోలేక గురువారం నల్గొండ జిల్లా చందంపేట మండలం యాపలపాయతండాలో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికులు తెలిపిన ప్రకారం... గ్రామానికి చెందిన కేతావత్‌ మంగ్త(55) ఖరీఫ్‌ ప్రారంభంలో కురిసిన వర్షానికి ఐదెకరాల్లో రూ.లక్ష పెట్టుబడితో పత్తి సాగు చేశారు. వర్షాలు అనుకూలించక పోవడంతో పత్తి మొక్కలు ఎండిపోయాయి. మళ్లీ సాగు చేయడానికి మరింత ఖర్చు అవుతుందని ఆందోళనకు గురయ్యారు. దీనికితోడు కుమార్తె వివాహానికి చేసిన అప్పు పెరిగిపోతోంది. వీటిని తీర్చే మార్గం లేక గురువారం ఉదయం పొలంలోనే పురుగు మందు తాగారు. గమనించిన ఇరుగుపొరుగు వారు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే ప్రాణాలు వదిలారు. గురువారం సాయంత్రం వరకు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై సతీష్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని