ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో గంజాయి కలకలం

వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో గంజాయి కలకలం సృష్టించింది. ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థుల వద్ద భద్రతా సిబ్బంది గంజాయి, సిగరెట్‌ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.

Published : 05 Jul 2024 04:46 IST

విద్యార్థుల నుంచి స్వాధీనం చేసుకున్న భద్రతా సిబ్బంది 

వేంపల్లె, న్యూస్‌టుడే: వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో గంజాయి కలకలం సృష్టించింది. ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థుల వద్ద భద్రతా సిబ్బంది గంజాయి, సిగరెట్‌ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. అన్నమయ్య జిల్లా గాలివీడు, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు ప్రాంతానికి చెందిన విద్యార్థులు బుధవారం కడపకు వెళ్లి అదే రోజు రాత్రి ట్రిపుల్‌ ఐటీకి తిరిగొచ్చారు. వారిని భద్రతా సిబ్బంది తనిఖీ చేయగా గంజాయి, సిగరెట్‌ ప్యాకెట్లు పట్టుబడ్డాయి. దీనిపై వారు వర్సిటీ అధికారులకు సమాచారమిచ్చారు. స్పందించిన ట్రిపుల్‌ఐటీ డైరెక్టర్‌ కుమారస్వామి గుప్తా, ఏవో రవికుమార్, ఇతర కోర్‌కమిటీ సభ్యులు విద్యార్థులను మందలించి, వారి తల్లిదండ్రులను క్యాంపస్‌కు పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని ఆర్కేవ్యాలీ ఎస్సై తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని