బావిలోని విష వాయువు పీల్చి 9మంది మృతి

ఛత్తీస్‌గఢ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో బావిలోని విష వాయువు పీల్చి 9 మంది మృత్యువాతపడ్డారు. మృతుల్లో తండ్రీ, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Published : 06 Jul 2024 03:22 IST

మృతుల్లో తండ్రీ, ఇద్దరు కుమారులు
ఛత్తీస్‌గఢ్‌లో కలకలం రేపిన రెండు వరుస ఘటనలు 

కికిర్దాలో ప్రమాదానికి కారణమైన బావి

చర్ల, న్యూస్‌టుడే- కోబ్రా: ఛత్తీస్‌గఢ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో బావిలోని విష వాయువు పీల్చి 9 మంది మృత్యువాతపడ్డారు. మృతుల్లో తండ్రీ, ఇద్దరు కుమారులు ఉన్నారు. జాంజ్‌గీర్‌-చాంపా జిల్లా కికిర్దా గ్రామంలో చాలా కాలంగా చెక్కలతో ఓ బావిని మూసి ఉంచారు. ఇటీవల గాలి దుమారానికి చెక్కలు అందులో పడిపోయాయి. దీంతో వాటిని తీసేందుకు గ్రామానికి చెందిన రామచంద్ర జైశ్వాల్‌ (60) బావిలోకి దిగారు. అనంతరం స్పృహ కోల్పోవడంతో ఆయన్ను రక్షించేందుకు పొరుగున ఉన్న రమేశ్‌ పటేల్‌(50), ఆయన కుమారులు జితేంద్ర పటేల్‌(25), రాజేంద్ర పటేల్‌(20), మరో వ్యక్తి బావిలోకి దిగారు. విష వాయువు పీల్చడంతో వారంతా ప్రాణాలు కోల్పోయారు.  

మరో ఘటనలో తండ్రీ, కుమార్తె..

కోబ్రా జిల్లా జురాలీ గ్రామంలోనూ ఇదే తరహా ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వ్యవసాయం చేస్తూ నీటి కోసం బావిలోకి దిగిన జాహ్రు పటేల్‌(60) స్పృహతప్పి పడిపోయారు. పటేల్‌ను కాపాడేందుకు ఆయన కుమార్తె సపీనా(16), మరో ఇద్దరు కుటుంబసభ్యులు బావిలోకి దిగారు. వీరంతా బావిలోని విష వాయువు పీల్చడంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని