తెదేపా కేంద్ర కార్యాలయంపై.. దాడి కేసులో మరో ఇద్దరి అరెస్టు

తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో మంగళగిరి గ్రామీణ పోలీసులు శనివారం మరో ఇద్దరు వైకాపా కార్యకర్తలను అరెస్టు చేశారు.

Published : 07 Jul 2024 05:19 IST

మంగళగిరి, న్యూస్‌టుడే: తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో మంగళగిరి గ్రామీణ పోలీసులు శనివారం మరో ఇద్దరు వైకాపా కార్యకర్తలను అరెస్టు చేశారు. విజయవాడ గుణదలకు చెందిన లంకా అద్దెనాయుడు, గుంటూరు రెడ్డిపాలేనికి చెందిన తియ్యగూర గోపిరెడ్డిలను అరెస్టు చేసి మంగళగిరి కోర్టులో హాజరుపరచగా జడ్జి ఈ నెల 19 వరకు రిమాండ్‌ విధించారు. ఈ ఘటనలో మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని 41ఏ నోటీసులు ఇచ్చి విడిచిపెట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని