రైలు కింద పడి ఆటోడ్రైవర్‌ ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులు తాళలేక, కుటుంబ పోషణ భారమై ఓ ఆటో డ్రైవర్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ రైల్వేస్టేషన్‌ పరిధిలోని ఈ ఘటన చోటుచేసుకుంది.

Published : 08 Jul 2024 03:37 IST

మిర్యాలగూడ, న్యూస్‌టుడే: ఆర్థిక ఇబ్బందులు తాళలేక, కుటుంబ పోషణ భారమై ఓ ఆటో డ్రైవర్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ రైల్వేస్టేషన్‌ పరిధిలోని ఈ ఘటన చోటుచేసుకుంది. రైల్వే ఎస్సై పవన్‌కుమార్‌రెడ్డి, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం దుర్గానగర్‌ కాలనీకి చెందిన నానాపురం నాగేంద్రబాబు(32) ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తాను నడుపుతున్న ఆటో తరచూ చెడిపోతుండటంతో దాన్ని అమ్మి సెకండ్‌ హ్యాండ్‌ ఆటో కొన్నారు. ఈ రెండింటికి ఫైనాన్స్‌ కిస్తీలు చెల్లించడం, కుటుంబాన్ని పోషించడం భారంగా మారింది. దీంతో మనస్తాపం చెందిన నాగేంద్రబాబు శనివారం రాత్రి రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డారు. నాగేంద్రబాబు మృతి విషయం తెలుసుకున్న ఆయన తండ్రి నర్సింహ అపస్మారక స్థితిలోకి వెళ్లగా మిర్యాలగూడ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. నాగేంద్రకు భార్య రేణుక, ఇద్దరు కుమారులున్నారు. బాధిత కుటుంబాన్ని ఆటో డ్రైవర్ల సంఘం ప్రతినిధులు పరామర్శించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు మహమ్మద్‌ నాజర్‌ అలీ మాట్లాడుతూ.. మహాలక్ష్మి పథకంతో ఆటోడ్రైవర్లు ఉపాధి కోల్పోతున్నారని, నాగేంద్రబాబు కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేయాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని