రూ. 2.89 కోట్ల బంగారం స్వాధీనం

విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) హైదరాబాద్‌ విభాగం పోలీసులు శనివారం పట్టుకున్నారు.

Published : 08 Jul 2024 03:41 IST

ఈనాడు, హైదరాబాద్‌: విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) హైదరాబాద్‌ విభాగం పోలీసులు శనివారం పట్టుకున్నారు. ఈ మేరకు ఆదివారం డీఆర్‌ఐ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు కోల్‌కతా నుంచి హైదరాబాద్‌ వస్తున్న బస్సును శివార్లలో ఆపి అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తుల కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో కిందకు దింపి తనిఖీ చేశారు. వస్త్రంతో ప్రత్యేకంగా తయారుచేసిన సంచులను వారిద్దరూ నడుముకు చుట్టుకుని అవి కనిపించకుండా యథావిధిగా దుస్తులు వేసుకున్నారు. ఈ సంచిని పరిశీలించగా అందులో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న బంగారం లభించింది. దీని తూకం వేయగా 3982.25 గ్రాములు ఉన్నట్లు తేలింది. ఈ బంగారం విలువ మార్కెట్లో రూ.2,89,90,780 ఉంటుందని అధికారులు లెక్కగట్టారు. బంగారాన్ని స్వాధీనం చేసుకొని ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకొని తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని