మందలించాడని టీచర్‌నే పొడిచి చంపిన విద్యార్థి

అస్సాంలోని శివసాగర్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తక్కువ మార్కులు వచ్చాయని మందలించిన ఉపాధ్యాయుడిని 11వ తరగతి చదువుతున్న విద్యార్థి కత్తితో పొడిచి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

Published : 08 Jul 2024 03:42 IST

గువాహటి: అస్సాంలోని శివసాగర్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తక్కువ మార్కులు వచ్చాయని మందలించిన ఉపాధ్యాయుడిని 11వ తరగతి చదువుతున్న విద్యార్థి కత్తితో పొడిచి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. శనివారం సివిల్‌ దుస్తుల్లో పాఠశాలకు హాజరైన 16ఏళ్ల విద్యార్థి ఉన్నట్టుండి రసాయనశాస్త్ర ఉపాధ్యాయుడు రాజేశ్‌ బారువా బెజవాడ (55) తలపై కత్తితో దాడి చేశాడు. ఆపై పలుమార్లు రాజేశ్‌ను దారుణంగా పొడిచాడు. రక్తం మడుగులో పడి ఉన్న ఆయన్ను ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో విద్యార్థికి తక్కువ మార్కులు రావటంతో రాజేశ్‌ అతన్ని మందలించాడు. తల్లిదండ్రులను తీసుకురమ్మని ఇంటికి పంపాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని