సర్వే ల్యాండ్‌ రికార్డ్స్‌ జూనియర్‌ అసిస్టెంట్‌ ఆత్మహత్యాయత్నం

ఖమ్మం నగరంలోని సర్వే ల్యాండ్‌ రికార్డ్స్‌ విభాగంలో పనిచేస్తున్న జూనియర్‌ అసిస్టెంట్‌ షేక్‌ అఫ్జల్‌ హసన్‌ శనివారం రాత్రి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు.

Published : 08 Jul 2024 03:42 IST

ఖమ్మం నేరవిభాగం, న్యూస్‌టుడే: ఖమ్మం నగరంలోని సర్వే ల్యాండ్‌ రికార్డ్స్‌ విభాగంలో పనిచేస్తున్న జూనియర్‌ అసిస్టెంట్‌ షేక్‌ అఫ్జల్‌ హసన్‌ శనివారం రాత్రి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఈ విషయం ఆదివారం రాత్రి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫోర్జరీ సంతకాలు సృష్టించి నకిలీ పత్రాలతో భూ రిజిస్ట్రేషన్లు చేసిన వివాదంలో ఆయనపై అభియోగాలు మోపుతూ ఖమ్మం రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో ఇటీవల మూడు కేసులు నమోదయ్యాయి. వీటిపై ఆయన అరెస్టయి జైలుకు వెళ్లారు. నాలుగు రోజుల క్రితమే బెయిలుపై బయటకు వచ్చారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారంటూ గత కలెక్టర్‌ అఫ్జల్‌ను కొన్నిరోజుల క్రితం సస్పెండ్‌ చేశారు. కేసు నమోదు, సస్పెన్షన్‌ పరిణామాలతో కలత చెందిన అఫ్జల్‌ హసన్‌ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం. కుటుంబసభ్యులు ఆయనను ఖమ్మంలోని ఓ ఆసుపత్రికి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని