ఆ ‘లోన్‌ యాప్‌’ వెంటనే తొలగించండి

సులభంగా రుణాలు ఇస్తామంటూ ఆన్‌లైనులో అనేక యాప్‌లు అందుబాటులోకి వస్తున్న రోజులివి. ఇటువంటి యాప్‌ల అనుమానాస్పద కార్యకలాపాలు, మోసాలపై కేంద్ర ప్రభుత్వం మరోసారి హెచ్చరికలు జారీ చేసింది.

Published : 08 Jul 2024 03:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సులభంగా రుణాలు ఇస్తామంటూ ఆన్‌లైనులో అనేక యాప్‌లు అందుబాటులోకి వస్తున్న రోజులివి. ఇటువంటి యాప్‌ల అనుమానాస్పద కార్యకలాపాలు, మోసాలపై కేంద్ర ప్రభుత్వం మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. ‘క్యాష్‌ఎక్స్‌పాండ్‌-యూ’ పేరుతో ఆన్‌లైనులో ఉన్న రుణాలు అందించే యాప్‌ నకిలీదని పేర్కొంది. ఈ యాప్‌ను గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి తొలగించామని, యూజర్లు కూడా ఫోన్లలో వెంటనే తొలగించాలని సూచించింది. ఈ నకిలీ లోన్‌ యాప్‌ మూలాలు శత్రుదేశంలో ఉన్నట్లు తెలిసిందని ప్రభుత్వ సైబర్‌ క్రైమ్‌ విభాగం సైబర్‌ దోస్త్‌ వెల్లడించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని