తలపై రూ.14 లక్షల రివార్డున్న నక్సలైట్‌ ఎదురుకాల్పుల్లో మృతి

మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌ జిల్లాలో సోమవారం భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో సోహన్‌ అలియాస్‌ ఉకాస్‌ అకా ఆయుతు మృతి చెందారు.

Published : 09 Jul 2024 03:48 IST

మధ్యప్రదేశ్‌లో ఘటన

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌ జిల్లాలో సోమవారం భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో సోహన్‌ అలియాస్‌ ఉకాస్‌ అకా ఆయుతు మృతి చెందారు. కథియాతోలా అటవీ ప్రాంతంలో నక్సల్స్‌ ఏరివేత కార్యకలాపాలు నిర్వహిస్తున్న భద్రతా బలగాలపై సాయుధులైన 12 మంది దాడికి దిగారని మధ్యప్రదేశ్‌ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ జైదీప్‌ ప్రసాద్‌ తెలిపారు. ఎదురుకాల్పులు ప్రారంభించడంతో వారందరూ పారిపోయారని, అనంతరం సోహాన్‌ మృత దేహం లభ్యమైందని వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాకు చెందిన సోహన్‌ పేలుడు పదార్థాల తయారీలో నిపుణుడు. అతని తలపై రూ.14లక్షల రివార్డు ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని