సాగునీటి తగాదాలో కాల్పులు.. పంజాబ్‌లో నలుగురి మృతి

పొలాలకు సాగునీటి పంపిణీపై నెలకొన్న పాతకక్షలు చివరకు కాల్పులకు దారితీసి పంజాబ్‌లో నలుగురి మృతికి కారణమైంది. గురుదాస్‌పుర్‌ జిల్లాలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

Published : 09 Jul 2024 03:49 IST

చండీగఢ్‌: పొలాలకు సాగునీటి పంపిణీపై నెలకొన్న పాతకక్షలు చివరకు కాల్పులకు దారితీసి పంజాబ్‌లో నలుగురి మృతికి కారణమైంది. గురుదాస్‌పుర్‌ జిల్లాలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. నీళ్ల పంపంకంపై గొడవ తలెత్తినప్పుడు రెండు గ్రూపుల్లో కలిపి 13 మంది ఉన్నారు. వారంతా ఒకే గ్రామానికి చెందినవారు. కాల్పుల్లో ఒక్కోవర్గం నుంచి ఇద్దరిద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోయారని పోలీసు అధికారులు తెలిపారు. ఘర్షణలో గాయపడిన మరో ఎనిమిది మందిని ఆసుపత్రిలో చేర్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని