బాలిక హత్య కేసులో.. నిందితుడి ఆచూకీ చెబితే రూ.50 వేల బహుమతి

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెంకు చెందిన బాలిక హత్య కేసులో నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి పోలీసులు రూ.50 వేల నగదు బహుమతి ప్రకటించారు.

Published : 09 Jul 2024 04:39 IST

అనకాపల్లి జిల్లా పోలీసుల ప్రకటన 

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెంకు చెందిన బాలిక హత్య కేసులో నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి పోలీసులు రూ.50 వేల నగదు బహుమతి ప్రకటించారు. కొప్పుగుండుపాలెంలో తొమ్మిదో తరగతి చదువుతున్న బద్ది దర్శినిని ఇదే గ్రామానికి చెందిన బోడాబత్తుల సురేష్‌ ఈ నెల 6న హత్య చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అప్పటి నుంచి అతని ఆచూకీ కోసం బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. సోమవారం నిందితుడి వివరాలతో పోస్టర్‌ను విడుదల చేశారు. అతని ఆచూకీ తెలిస్తే 94407 96084, 94407 96108, 94409 04229, 73826 25531 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని