ముంబయిలో మిహిర్‌ షా అరెస్టు

మహారాష్ట్రలోని ముంబయిలో మద్యం మత్తులో కారును నడుపుతూ ఓ వివాహిత మరణానికి కారణమైన ఘటనలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు.

Published : 10 Jul 2024 03:01 IST

ముంబయి: మహారాష్ట్రలోని ముంబయిలో మద్యం మత్తులో కారును నడుపుతూ ఓ వివాహిత మరణానికి కారణమైన ఘటనలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. శివసేన నేత రాజేశ్‌ షా కుమారుడు మిహిర్‌ షా(24)ను మంగళవారం ముంబయిలోని విరారా ప్రాంతంలో అరెస్టు చేసినట్లు ప్రకటించారు. మిహిర్‌ తల్లి, ఇద్దరు తోబుట్టువులతో పాటు మరో 10 మందిని విచారించినట్లు అధికారులు తెలిపారు. ఇటీవల ముంబయిలోని వర్లీ ప్రాంతంలో తెల్లవారుజామున మిహిర్‌ మద్యం మత్తులో బీఎండబ్ల్యూ కారు వేగంగా నడుపుతూ ముందు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన సంగతి తెలిసిందే. మహిళపై నుంచి కారు దూసుకెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందిగా.. భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం తర్వాత వాహనాన్ని కొంత దూరంలో వదిలి మిహిర్‌ ఘటనాస్థలం నుంచి పారిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు మిహిర్‌కు సహకరించిన కొందరు నిందితులను అరెస్టు చేశారు. వీరిలో నిందితుడి తండ్రి రాజేశ్‌ షా కూడా ఉన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని