ఆవాస్‌ యోజన డబ్బు చేతికి రాగానే.. భర్తలను వదిలేసి ప్రేమికులతో పరార్‌

‘ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన’ కింద మొదటివిడత సాయం పొందిన పలువురు వివాహితలు.. తమ భర్తలను వదిలేసి నచ్చిన వారితో పారిపోయినట్లు తేలింది.

Published : 10 Jul 2024 03:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన’ కింద మొదటివిడత సాయం పొందిన పలువురు వివాహితలు.. తమ భర్తలను వదిలేసి నచ్చిన వారితో పారిపోయినట్లు తేలింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ వ్యవహారం వెలుగుచూసింది. మహరాజ్‌గంజ్‌ జిల్లాలో ఇటీవల 2,350 మందికి ఆవాస్‌ యోజన నగదు విడుదలైంది. తొలివిడతగా రూ.40 వేల చొప్పున లబ్ధిదారుల ఖాతాల్లో జమైంది. ఇదే సమయంలో తమ భార్యలు ప్రేమికులతో/నచ్చిన వారితో వెళ్లిపోయారంటూ అనేకమంది బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఇలా జిల్లాలో 11 కేసులు నమోదైనట్లు సమాచారం. అప్రమత్తమైన అధికారులు ఈ పథకం కింద రెండోవిడత నగదును నిలిపివేయాలని నిర్ణయించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. పీఎంఏవై కింద పక్కా ఇళ్ల నిర్మాణం కోసం పేద, మధ్యతరగతి కుటుంబాలకు రాయితీ రూపంలో గరిష్ఠంగా రూ.2.5 లక్షల వరకు ఆర్థికసాయాన్ని కేంద్రం అందిస్తున్న విషయం తెలిసిందే.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని