అప్పుల బాధతో కౌలు రైతు బలవన్మరణం

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం బస్వాపూర్‌ గ్రామానికి చెందిన కళ్లెం లింగయ్య(35) అనే కౌలు రైతు అప్పుల బాధతో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు.

Published : 11 Jul 2024 02:43 IST

కాటారం, న్యూస్‌టుడే: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం బస్వాపూర్‌ గ్రామానికి చెందిన కళ్లెం లింగయ్య(35) అనే కౌలు రైతు అప్పుల బాధతో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఎస్సై అభినవ్‌ తెలిపిన వివరాల మేరకు.. లింగయ్య మూడేళ్ల నుంచి 2.20 ఎకరాల భూమి కౌలుకు తీసుకొని పత్తి పంట సాగు చేస్తున్నారు. ప్రతికూల వాతావరణంతో పంట సరిగా పండక దిగుబడి రాలేదు. సుమారు రూ.4 లక్షల మేర అప్పుల పాలయ్యారు. దీంతో మనోవేదన చెంది మంగళవారం రాత్రి పురుగుల మందు తాగారు. కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌లో భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి తరలించగా మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య సుశీల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని