భారత్‌ - చైనా సరిహద్దులో 108 కిలోల బంగారం పట్టివేత

భారత్‌ - చైనా సరిహద్దులోని తూర్పు లద్దాఖ్‌లో అక్రమంగా రవాణా చేస్తున్న 108 కిలోల బంగారాన్ని భద్రతాదళాలు స్వాధీనం చేసుకున్నాయి.

Published : 11 Jul 2024 02:44 IST

లేహ్‌: భారత్‌ - చైనా సరిహద్దులోని తూర్పు లద్దాఖ్‌లో అక్రమంగా రవాణా చేస్తున్న 108 కిలోల బంగారాన్ని భద్రతాదళాలు స్వాధీనం చేసుకున్నాయి. 21వ బెటాలియన్‌ ఇండో - టిబెటన్‌ సరిహద్దు పోలీసు (ఐటీబీపీ) బలగాలు మంగళవారం గస్తీ నిర్వహిస్తున్న క్రమంలో స్మగ్లింగు గురించి సమాచారం అందింది. అనుమానాస్పదంగా గాడిదలపై వెళుతున్న ఇద్దరు వ్యక్తులను ఆపి ప్రశ్నించారు. ఔషధ మొక్కల డీలర్లమని చెప్పి వారు తప్పించుకునే ప్రయత్నం చేశారు. వెంబడించి పట్టుకొని సోదా చేశారు. 108 కిలోల బంగారు కడ్డీలతోపాటు రెండు మొబైల్‌ ఫోన్లు, బైనాక్యులర్, రెండు కత్తులు, చైనాకు చెందిన కొన్ని ఆహార పదార్థాలను వారి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు ఐటీబీపీ వెల్లడించింది. రికవరీలో భాగంగా మరో వ్యక్తితో కలిపి మొత్తం ముగ్గురిని అరెస్టు చేసినట్లు తెలిపింది. ఈ బంగారం విలువ సుమారు రూ.80 కోట్లకు పైగా ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని