రెండు గంజాయి ముఠాల ఆటకట్టు

గంజాయి రవాణా చేస్తున్న రెండు ముఠాలను అల్లూరి సీతారామరాజు జిల్లా మోతుగూడెం పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ.40 లక్షల విలువచేసే 800 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

Published : 11 Jul 2024 04:06 IST

నలుగురి అరెస్టు
రూ.40 లక్షల విలువైన 800 కిలోల పట్టివేత 

వివరాలు వెల్లడిస్తున్న ఏఎస్పీ రాహుల్‌మీనా. చిత్రంలో నిందితులు (ముసుగులు ధరించిన వ్యక్తులు)

చింతూరు, న్యూస్‌టుడే: గంజాయి రవాణా చేస్తున్న రెండు ముఠాలను అల్లూరి సీతారామరాజు జిల్లా మోతుగూడెం పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ.40 లక్షల విలువచేసే 800 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. చింతూరు ఏఎస్పీ రాహుల్‌ మీనా బుధవారం విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం... మధ్యప్రదేశ్‌కు చెందిన ఆరుగురు ఒడిశాలో సంజీవ్‌ అనే వ్యక్తి వద్ద 550 కేజీల గంజాయిని కొని తమ రాష్ట్రానికి తరలించేందుకు మోతుగూడెం గ్రామ శివార్లలో వ్యాన్‌లో లోడింగ్‌ చేస్తున్నారు. తమకు అందిన సమాచారంతో పోలీసులు దాడిచేశారు. మధ్యప్రదేశ్‌కు చెందిన అమిత్‌గిరి, శిదయాళ్‌ దోరే, అలోక్‌ గైతమ్‌లను పట్టుకున్నారు. ఈ రవాణాతో సంబంధమున్న రంజిత్‌ మావై, సంజీవ్‌ పరారయ్యారు.   పోలీసులు వ్యాన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

తూర్పుగోదావరి జిల్లా మంగంపాడు నుంచి కారులో హైదరాబాద్‌ తరలిస్తున్న 250 కేజీల గంజాయిని మోతుగూడెం వద్ద పోలీసులు పట్టుకున్నారు. కారును స్వాధీనం చేసుకుని, మజ్జి వెంకట్‌ సుమంత్‌ను అరెస్టు చేశారు. ఇతడు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక ఐటీసీలో పని చేస్తున్నాడు. కారులో ఉన్న సారపాకకు చెందిన సతీష్‌రెడ్డి, జనగాంకు చెందిన వివేక్‌ పరారయ్యారు. విలేకరుల సమావేశంలో చింతూరు సీఐ గజేంద్రకుమార్, మోతుగూడెం ఎస్సై గోపాల్, పోలీసులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని