యూట్యూబర్‌ ప్రణీత్‌కు 14 రోజుల రిమాండ్‌ విధించిన నాంపల్లికోర్టు

మంచీచెడుల విచక్షణ మరచి తండ్రి, కూతురు బంధానికి అశ్లీలం జోడించి మాట్లాడిన బూతు యూట్యూబర్‌ ప్రణీత్‌ హనుమంతుకు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యూడీషియల్‌ రిమాండ్‌ విధించింది.

Published : 11 Jul 2024 17:05 IST

హైదరాబాద్‌: మంచీచెడుల విచక్షణ మరచి తండ్రి, కూతురు బంధానికి అశ్లీలం జోడించి మాట్లాడిన బూతు యూట్యూబర్‌ ప్రణీత్‌ హనుమంతుకు హైదరాబాద్‌ నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యూడీషియల్‌ రిమాండ్‌ విధించింది. ప్రణీత్‌పై 67బీ ఐటీ యాక్ట్, ఫోక్సో యాక్ట్ ,79, 294 బీఎన్‌ఎస్‌ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి బెంగళూరులో అరెస్టు చేసిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు గురువారం నాంపల్లి కోర్టులో హాజరు పర్చారు. ప్రణీత్‌కు 14 రోజుల రిమాండ్‌ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఇదే కేసులో ఏ2గా డల్లాస్‌ నాగేశ్వరరావు, ఏ3గా బుర్రా యువరాజ్‌, ఏ4గా సాయి ఆదినారాయణను చేర్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని