TS News: మనోధైర్యం చెప్పి..మహమ్మారికి బలై

కరోనాతో నాలుగు రోజుల వ్యవధిలో యువ దంపతులు మృతి చెందిన హృదయవిదారక ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో చోటుచేసుకుంది.

Updated : 24 May 2021 08:10 IST

యువ దంపతుల విషాదాంతం

కూసుమంచి, న్యూస్‌టుడే: కరోనాతో నాలుగు రోజుల వ్యవధిలో యువ దంపతులు మృతి చెందిన హృదయవిదారక ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో చోటుచేసుకుంది. కూసుమంచికి చెందిన ఆర్టీసీ ఉద్యోగి కందుల వెంకటేశ్వర్లు, ఆయన భార్య డేవిడ్‌మణి కొవిడ్‌ బారినపడి కొత్తగూడెం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తన తల్లిదండ్రులకు మనోధైర్యం చెబుదామని హైదరాబాద్‌ నుంచి తనభర్త దామళ్ల రాము(34)తో కలిసి దామళ్ల శైలజ(31) కొత్తగూడెం వచ్చారు. వీరిద్దరికీ మహమ్మారి సోకింది. కొత్తగూడెంలోనే చికిత్స పొందుతున్న క్రమంలో గురువారం ఊపిరాడని పరిస్థితుల్లో శైలజ ప్రాణాలొదిలారు. శుక్రవారం ఈమె భర్త రామును ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. రాము హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు. ఆయన తల్లిదండ్రులు కూడా వైరస్‌ బారినపడి చికిత్స పొందుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని