AP News: యువకుడిని చితకబాదిన ఎస్సై

కడప నగరంలో ఓ ఎస్సై ప్రవర్తన విమర్శలకు తావిచ్చింది. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించాడని ఓ యువకుడిని చితకబాదిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ దృశ్యాలు

Updated : 28 May 2021 08:03 IST

వీఆర్‌కు బదిలీ చేసిన ఎస్పీ

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే: కడప నగరంలో ఓ ఎస్సై ప్రవర్తన విమర్శలకు తావిచ్చింది. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించాడని ఓ యువకుడిని చితకబాదిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ నెల 25న కర్ఫ్యూ ఆంక్షలు కొనసాగుతున్న సమయంలో ఓ యువకుడు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఎదురుగా కడప రెండో పట్టణ ఠాణా ఎస్సై జీవన్‌రెడ్డి కనిపించారు. యువకుడు భయపడి వాహనాన్ని వెనక్కి తిప్పి కొద్ది దూరం రాగానే అదుపు తప్పి కిందపడ్డాడు. వెంటనే ఎస్సై అక్కడికి వచ్చి అతన్ని లాఠీతో చితకబాదారు. యువకుడు ఎస్సై కాళ్లు పట్టుకున్నప్పటికీ వదిలిపెట్టలేదు. దీంతో ఒళ్లంతా గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఎస్పీ అన్బురాజన్‌ విచారించి ఎస్సైని వీఆర్‌కు బదిలీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని