AP News: మాట మరిచారని.. మృత్యువు ఆగుతుందా?

విద్యుత్‌శాఖ సిబ్బంది నిర్లక్ష్యం ఓ యువ రైతు ప్రాణాలను బలిగొంది. ఈ సంఘటన అనంతపురం జిల్లా యాడికి మండల పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, రైతుల కథనం ప్రకారం... నగరూరు గ్రామానికి చెందిన నారాయణస్వామిరెడ్డి కుమారుడు రమణారెడ్డి (24) వ్యవసాయంలో తండ్రికి చేదోడుగా ఉండేవాడు.

Updated : 02 Jul 2021 07:11 IST

విద్యుత్‌ సిబ్బంది నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

యాడికి, న్యూస్‌టుడే: విద్యుత్‌శాఖ సిబ్బంది నిర్లక్ష్యం ఓ యువ రైతు ప్రాణాలను బలిగొంది. ఈ సంఘటన అనంతపురం జిల్లా యాడికి మండల పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, రైతుల కథనం ప్రకారం... నగరూరు గ్రామానికి చెందిన నారాయణస్వామిరెడ్డి కుమారుడు రమణారెడ్డి (24) వ్యవసాయంలో తండ్రికి చేదోడుగా ఉండేవాడు. పొలంలో విద్యుత్‌కు సంబంధించి మరమ్మతు చేయాలంటూ గురువారం స్థానిక లైన్‌మన్‌ను రమణారెడ్డి కోరారు. ‘వేరే సమస్యపై విద్యుత్‌ సరఫరా (ఎల్‌సీ) ఆపాం.. ఆ పని నీవే చేసుకో’ అంటూ లైన్‌మన్‌... ఇంటి దగ్గరున్న రమణారెడ్డికి ఫోన్‌లో చెప్పారు. చేసేది లేక రమణారెడ్డి పొలానికి వెళ్లి స్తంభం ఎక్కి మరమ్మతు చేసుకుంటున్నారు. వేరేచోట చేస్తున్న పని పూర్తవటంతో... రమణారెడ్డికి మరమ్మతు చేసుకోవాలని చెప్పిన మాట మరచిన సిబ్బంది.. విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు. స్తంభంపై తీగల మధ్య ఉన్న రమణారెడ్డి విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు