
Crime: ఫోన్లో మాట్లాడుతున్నారని.. కర్రలతో చితకబాదారు
ఇద్దరు అక్కాచెల్లెళ్లపై కుటుంబ సభ్యుల అమానుషం
ధార్: మేనమామ కుమారులతో ఫోన్లో మాట్లాడుతున్నారన్న ఆగ్రహంతో ఇద్దరు గిరిజన అక్కాచెల్లెళ్లను సొంత కుటుంబ సభ్యులే జుట్టు పట్టి ఈడుస్తూ కర్రలతో చితకబాదిన దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాడి చేసినవారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ఈ ఘటనలో ఏడుగురిని అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లా పిపల్వ గ్రామంలో జూన్ 22న ఈ ఘటన జరిగింది. వీడియో సామాజికమాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసులు దీనిపై దృష్టి పెట్టారు. 19, 20 ఏళ్ల వయసున్న బాధితురాళ్లను స్టేషన్కు పిలిపించి విచారణ చేపట్టారు. నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.