TS News: బెయిల్‌కు బేరం

లంచం కావాలంటూ వేధించిన పోలీసు అధికారి చివరకు అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. అనిశా డీఎస్పీ కె.భద్రయ్య తెలిపిన వివరాల ప్రకారం... కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి మండలం బాహుపేట గ్రామానికి చెందిన అల్లె సత్తయ్యతో పాటు ఆయన కుమారుడు

Published : 15 Jul 2021 07:35 IST

అనిశా వలలో బెల్లంపల్లి ఎస్‌ఐ

బెల్లంపల్లి పట్టణం, న్యూస్‌టుడే: లంచం కావాలంటూ వేధించిన పోలీసు అధికారి చివరకు అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. అనిశా డీఎస్పీ కె.భద్రయ్య తెలిపిన వివరాల ప్రకారం... కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి మండలం బాహుపేట గ్రామానికి చెందిన అల్లె సత్తయ్యతో పాటు ఆయన కుమారుడు వేణుపై లారీని అమ్ముకుని దొంగతనానికి గురైందని పేర్కొంటునట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో వారిపై అదే జిల్లాకు చెందిన ఫైనాన్స్‌ వ్యాపారి బద్దం సురేష్‌రెడ్డి 2019లో లారీ అమ్మకం జరిగిందని భావిస్తున్న మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రెండో పట్టణ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. సత్తయ్య ఫైనాన్స్‌లో లారీ తీసుకుని దొంగతనం అయిందని చెప్పి మహారాష్ట్రకు చెందిన వ్యక్తికి అమ్ముకున్నారని అందులో పేర్కొన్నారు. ఈ కేసులో స్టేషన్‌ బెయిల్‌ కోసం సత్తయ్య, ఆయన కుమారుడు అల్లె నవీన్‌  రెండో పట్టణ ఎస్‌ఐ కె.భాస్కర్‌రావుతో రూ.1.20 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో నవీన్‌ అనిశాను ఆశ్రయించారు. ఎస్‌ఐ తన ప్రైవేట్‌ డ్రైవర్‌ రాజ్‌కుమార్‌ను డబ్బులు తీసుకోవడానికి పంపించారు. డ్రైవర్‌ రూ.1.20 లక్షలు తీసుకుంటుండగా అనిశా అధికారులు అతనిని పట్టుకున్నారు. ఎస్‌ఐ భాస్కర్‌రావు లంచం తీసుకున్నట్లు విచారణలో తేలిందని భద్రయ్య చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ఎస్‌ఐతో పాటు డ్రైవర్‌ను అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని