TS Genco: భార్య, కుమారుడితో జెన్‌కో ఉద్యోగి అదృశ్యం

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌ జెన్‌కోలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి కుటుంబం అదృశ్యం కలకలం రేపుతోంది. మండారి రామయ్య ఉదయం తన కుటుంబంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అతని ఇంట్లో ఉత్తరం పెట్టి అదృశ్యమైన ఘటన గురువారం చోటుచేసుకుంది..

Updated : 23 Jul 2021 07:19 IST

నాగార్జునసాగర్‌ కొత్త వంతెన వద్ద వాహనం లభ్యం

ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ


అదృశ్యమైన మండారి రామయ్య

పెద్దవూర రూరల్‌, న్యూస్‌టుడే: నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌ జెన్‌కోలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి కుటుంబం అదృశ్యం కలకలం రేపుతోంది. మండారి రామయ్య ఉదయం తన కుటుంబంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అతని ఇంట్లో ఉత్తరం పెట్టి అదృశ్యమైన ఘటన గురువారం చోటుచేసుకుంది. నాగార్జున సాగర్‌లోని పైలాన్‌లోని జెన్‌కో కాలనీ 9హెచ్‌లో రామయ్య(36) నివాసముం టున్నారు. ఆర్థిక, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాను. తానొక్కడిని చనిపోతే తన భార్య నాగమణి(30), కుమారుడు సాత్విక్‌(12) అనాథలవుతారనే ఉద్దేశంతో వారిని కూడా తోడు తీసుకెళ్లినట్లు లేఖలో పేర్కొన్నారు. కొత్త వంతెనపై అతని ద్విచక్ర వాహనం, చరవాణి ఉండడంతో అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పలువురు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, బంధువులు నదీతీరంలో ఉదయం నుంచి గాలింపు చర్య లు చేపట్టారు. పోలీసులు విచారణ చేపట్టగా రామయ్య, అతడి భార్య, కుమారుడు ద్విచక్రవాహనంపై వెళ్లినట్లు సీసీ కెమెరాలో ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. తిరుమలగిరి (సాగర్‌) మండలం చింతల పాలెం గ్రామా నికి చెందిన రామయ్య వ్యవసాయ భూమి టెయిల్‌పాడ్‌ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపునకు గురైంది. అతనికి నిర్వాసితుల కింద జెన్‌కోలో అటెండర్‌ ఉద్యోగం ఇచ్చారు. బంధువుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై నర్సింహరావు తెలిపారు.


నాగార్జునసాగర్‌ కొత్త వంతెన వద్ద పరిశీలిస్తున్న పోలీసులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని