AP News: గర్భిణిని రైలు నుంచి తోసేసిన కేసులో జీవితఖైదు

నడుస్తున్న రైలు నుంచి గర్భిణిని కిందకు తోసివేసి చోరీకి పాల్పడిన కేసులో నిందితుడు వేలాయుధం రాజేంద్రన్‌కు జీవితఖైదు విధిస్తూ అనంతపురం మహిళా న్యాయస్థానం గురువారం తీర్పును వెలువరించింది.

Updated : 23 Jul 2021 06:54 IST

అనంతపురం(రైల్వే), న్యూస్‌టుడే: నడుస్తున్న రైలు నుంచి గర్భిణిని కిందకు తోసివేసి చోరీకి పాల్పడిన కేసులో నిందితుడు వేలాయుధం రాజేంద్రన్‌కు జీవితఖైదు విధిస్తూ అనంతపురం మహిళా న్యాయస్థానం గురువారం తీర్పును వెలువరించింది. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు.. 2018 డిసెంబరు 18న గుంటూరుకు చెందిన దివ్యశ్రీ విజయవాడ నుంచి బెంగళూరుకు కొండవీడు ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరారు. అనంతపురం దాటిన తర్వాత రైలు తక్కువ వేగంతో వెళ్తున్న సమయంలో ఓ దొంగ ఆమెను బోగీ నుంచి కిందకు తోసివేయడంతో పాటు తానూ కిందకు దూకేశాడు. బాధితురాలిని ముళ్లపొదళ్లలోకి లాక్కెళ్లాడు. అక్కడ ఆమె బంగారు ఆభరణాలు లాక్కున్నాడు. బలంగా కిందకు తోసివేయడంతో అక్కడే ఆమెకు గర్భస్రావం జరిగింది. అనంతరం పోలీసులు బాధితురాలిని ఆసుపత్రికి తరలించడంతో కోలుకున్నారు. జీఆర్పీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు చెన్నై సమీపంలోని తిర్‌విర్‌కాడ్‌ గ్రామానికి చెందిన వేలాయుధం రాజేంద్రన్‌గా గుర్తించారు. 2019 జనవరి 2న అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. అప్పటి నుంచి జైలులో రిమాండు ఖైదీగా ఉన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని