బస్సు దగ్ధం.. ప్రయాణికులు సురక్షితం
జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ వద్ద శుక్రవారం ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. వరంగల్ 1 డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు 30 మంది ప్రయాణికులతో శుక్రవారం మధ్యాహ్నం హన్మకొండ నుంచి హైదరాబాద్‌కు
జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ వద్ద శుక్రవారం ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. వరంగల్ 1 డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు 30 మంది ప్రయాణికులతో శుక్రవారం మధ్యాహ్నం హన్మకొండ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. దీనికి ఇంజిన్ వెనకాల ఉంది. స్టేషన్‌ఘన్‌పూర్ వద్దకు చేరగానే ఇంజిన్ నుంచి పొగలు వెలువడి వాసన రావడంతో డ్రైవర్ వెంకటేశ్ అప్రమత్తమయ్యారు. వెంటనే ప్రయాణికులను దింపారు. కాసేపటికే భారీ మంటలు ఎగసిపడి బస్సు మొత్తం కాలిపోయింది. స్థానిక గ్రామపంచాయతీ సిబ్బంది నీటి ట్యాంకర్ తీసుకొచ్చి మంటలను ఆర్పారు. ఇంజిన్‌లో తలెత్తిన షాట్ సర్క్యూట్‌తోనే ప్రమాదం జరిగిందని వరంగల్ అర్బన్ జిల్లా డీవీఎం శ్రీనివాసరావు తెలిపారు.
- న్యూస్‌టుడే, స్టేషన్‌ఘన్‌పూర్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
-
Ts-top-news News
తెలంగాణలో మరోదఫా ఓటర్ల జాబితా సవరణ
-
Sports News
ఆ మార్పులు కలిసొచ్చాయి: గిల్
-
Movies News
నాలోని కామెడీ కోణమే.. మెర్క్యురీ సూరి
-
Movies News
Abhiram: భయంతో నిద్ర పట్టడం లేదు.. తేజ అందరి ముందు తిట్టారు: అభిరామ్
-
World News
Ross: 54 ఏళ్ల నిరీక్షణ.. 71 ఏళ్ల వయస్సులో డిగ్రీ పట్టా!