TS News: వయసు 17 ఏళ్లు.. ముగ్గురితో ప్రే‘మాయ’ణం!

ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమ, పెళ్లి పేరుతో సంబంధాలు పెట్టుకుని ఓ బాలుడు(17) ఏకంగా ముగ్గురు బాలికలను మోసం చేసిన ఘటన మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలంలో బుధవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Updated : 05 Aug 2021 07:17 IST

మహబూబాబాద్‌ జిల్లాలో బాలుడి నిర్వాకం

గార్ల, న్యూస్‌టుడే: ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమ, పెళ్లి పేరుతో సంబంధాలు పెట్టుకుని ఓ బాలుడు(17) ఏకంగా ముగ్గురు బాలికలను మోసం చేసిన ఘటన మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలంలో బుధవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలుడు మొదట పక్క గ్రామానికి చెందిన బాలిక(16)ను ప్రేమ పేరుతో వంచించి శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఇది ఆమె తల్లిదండ్రులకు తెలియడంతో కొంత డబ్బు చెల్లించి తెగతెంపులు చేసుకున్నాడు. తరువాత మరో బాలిక(14)తో శారీరక సంబంధం పెట్టుకుని, ఇంకో బాలిక(17)ను పెళ్లి చేసుకుంటానంటూ దగ్గరయ్యాడు. అనుమానంతో మూడో బాలిక బాలుడి ఇంటికే రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై బాలుడు, మూడో బాలిక కుటుంబసభ్యులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. దీనిపై విచారణ చేస్తున్నామని ఎస్సై రవి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని