Published : 23/08/2021 03:41 IST

‘అమరావతి’లో నిర్మాణ సామగ్రి చోరీ

ముగ్గురి అరెస్టు

తుళ్లూరు, న్యూస్‌టుడే: రాజధాని అమరావతిలోని సీడ్‌ యాక్సెస్‌ రోడ్డులో లింగాయపాలెంవద్ద ఎన్‌సీసీ కంపెనీకి చెందిన వెట్‌మిక్స్‌ క్యాంపస్‌లో రూ.2లక్షల విలువచేసే నిర్మాణ సామగ్రిని దొంగిలించి తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు తుళ్లూరు సీఐ దుర్గాప్రసాద్‌ ఆదివారం తెలిపారు. రాయపూడి గ్రామానికి చెందిన యువకులు పఠాన్‌ ఆలీ షహీద్‌, సయ్యద్‌ మాబుజాని, కొయ్యగూర వంశీ శనివారం రాత్రి ఆటోలో ఇనుము తదితర వస్తువులను తరలిస్తుండగా.. గస్తీలో ఉన్న పోలీసులు పట్టుకున్నట్లు తెలిపారు. చోరీ చేసిన వస్తువులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు. అమరావతి ప్రాంతంలో అభివృద్ధి పనులను చేపట్టేందుకు వచ్చిన కంపెనీలు తమ సామగ్రిని భద్రంగా ఉంచుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని