ప్రేమ పెళ్లి: గర్భిణికి బలవంతంగా ఆపరేషన్‌.. బిడ్డ తొలగింపు

వద్దన్నా ప్రేమ వివాహం చేసుకుందన్న కోపంతో తల్లి, సోదరి కలిసి ఓ గర్భిణికి బలవంతంగా ఆపరేషన్‌ చేసి బిడ్డను తొలగించిన అమానవీయ ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తిలో వెలుగుచూసింది. జంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన సునీత (19) అదే గ్రామానికి చెందిన

Updated : 08 Sep 2021 09:22 IST

తల్లి, సోదరి కలిసి చేసిన దుర్మార్గం  

ఊర్కొండ, న్యూస్‌టుడే: వద్దన్నా ప్రేమ వివాహం చేసుకుందన్న కోపంతో తల్లి, సోదరి కలిసి ఓ గర్భిణికి బలవంతంగా ఆపరేషన్‌ చేసి బిడ్డను తొలగించిన అమానవీయ ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తిలో వెలుగుచూసింది. జంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన సునీత (19) అదే గ్రామానికి చెందిన రవికుమార్‌ (23) ప్రేమించుకున్నారు. పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు. అయినా వారు పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం సునీత 8 నెలల గర్భిణి. విశ్రాంతి అవసరం కావటంతో రవికుమార్‌ ఆమెను తమ బంధువుల ఇంటి వద్ద ఉంచారు. సునీత తల్లి వెంకటమ్మ, అక్క సరిత మంగళవారం ఆమె వద్దకు వెళ్లారు. ఆసుపత్రిలో చూపిస్తానని నమ్మించి ఆటోలో తీసుకెళ్లారు. ఈ విషయం తెలియటంతో రవికుమార్‌ అనుమానం వచ్చి ఊర్కొండ ఠాణాలో ఫిర్యాదు చేశారు. సునీత బంధువు ఒకరు కల్వకుర్తిలో నర్సుగా పనిచేస్తారు. అదే ఆసుపత్రికి తీసుకెళ్లి ఉండవచ్చన్న అనుమానంతో పోలీసులు అక్కడికి వెళ్లగా సునీతకు ఆపరేషన్‌ చేసి బిడ్డను తొలగించిన విషయం వెలుగుచూసింది. సునీత తల్లి, సోదరి, శస్త్రచికిత్స చేసిన వైద్యురాలు డా.శ్రీవాణి, ఇందుకు సహకరించిన నర్సుతోపాటు మరో ఆరుగురు బంధువులపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి తల్లిని, సోదరిని రిమాండ్‌కు తరలించామని ఎస్సై విజయ్‌కుమార్‌ తెలిపారు. వైద్యురాలితోపాటు మిగతావారు పరారీలో ఉన్నారని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని